పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం

పశు పోషణ విభాగం అధిపతి డాక్టర్ డి నాగలక్ష్మి.

పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం

 -  రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ):                                           పశు పోషణలలో రైతులకు మెలకువలు ఎంతో అవసరమని రాజేంద్ర నగర్ లోని పశు వైద్య కళాశాల విభాగం పశు పోషణ విభాగం అధిపతి డాక్టర్ డి. నాగలక్ష్మి అన్నారు. గురువారం రాజేంద్ర నగర్ లోని తెలంగాణ పి.వి. నరసింహరావు పశువైద్య విశ్వ విద్యలయం పశువైద్య  కళాశాల పశుపోషణ విభాగం, ఐ సి ఏ ఆర్ జాతీయ మాంస పరిశోధన ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల రైతులు కు "పాడి పశువులలో అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం కోసం  పోషణలో మెలకువలు అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విభాగం అధిపతి డాక్టర్ డి నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. పశువుల ఉత్పాదకతను పెంచడంలో సరైన సమతుల్య ఆహారం వంటి ప్రధాని అంశాలపై తెలియచెప్పారు. పశువులకు అవసరమైన ఖనిజా లవణాలు, విటమిన్లు, నాణ్యమైన మేతను అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతోపాటు అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు.  అంతేకాకుండా పునరుత్పత్తి ఎలా పెంచాలో సావివరంగా వివరించారు. శిక్షణ కార్యక్రమంలో  రైతులకు కళాశాల అసోసయేట్ డీన్ డా.డి మాధురి  పాడి పశువుల పెంపకం పాల ఉత్పత్తి, పునరుత్పత్తి వంటి అంశాలపై రూపొందించిన పుస్తకాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యయలయం అధ్యాపకులు డా.ఎన్. నళిని కుమారి , డా.జె.నరసేంహ , డా. అలెగ్జాండర్,డా. ఏ. సుధీర్ బాబు, డా. రామకృషణలు పాల్గొన్నారు. సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ డి.రత్నాకర్, జనగామ జిల్లా సిరిపురం, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చెందిన రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం
పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ
హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి.
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...