పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
వీరేపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు.
మిర్యాలగూడ మార్చి 26
(లోకల్ గైడ్ తెలంగాణ)
రాష్ట్రంలో ఏర్పడిన కృత్రిమ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల వ్యవసాయ రంగం కుదేలు కా నున్నట్టు సిపిఎం జిల్లా కార్య దర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుద్ధం పేరుతో డిజిల్ పెట్రోల్ గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పరుస్తున్నారని దీనివల్ల గృహ అవసరాలే కాక వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం చూప నుందని ప్రభుత్వం చొరవ తీసుకొని కొరత లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయకట్టు ప్రాంతమే కాక నానా ఆయకట్టులో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పొట్ట దశలో వరి పొలాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయని కోత దిశలో ఆయకట్టులో పొలాలు ఉన్నాయని ఈ దశలో పెట్రోల్ డీజిల్ అందకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇరాన్ అమెరికాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు శక్తి ఉండి కూడా ఆపకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం సరైనది కాదన్నారు. పాలకులు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని అది దేశానికే శ్రేయస్కరం కాదని వారు తెలిపారు. కొరతను ప్రభుత్వం వెంటనే స్పందించి తీర్చాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ కొరత లేదని మంత్రులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదనిపిస్తుందని వారి ప్రకటన విరుద్ధంగా కింది స్థాయిలో జరుగుతుందని ఇలాంటి దివాలాకోరు ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టొద్దని వారు హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం నాయకులు మంగారెడ్డి రవి నాయక్ జగదీష్ చంద్ర ఎస్ఎఫ్ఐ నాయకులు శంకర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
