వైభవంగా ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివ పడి పూజ.
నందికొల వీరభద్ర సేవ.
కన్నుల పండుగగా కలశం ఊరేగింపు.
నారాయణపేట జనవరి 31:
నారాయణపేట మండల పరిధిలోని జాజాపూర్ గ్రామంలోని ఈశ్వర్ మందిర్ లో శనివారం ద్వాదశ జ్యోతి ర్లింగాల మహా పూజ అధ్యం తం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ కొనసాగింది. గురు స్వాములు శివ శ్రీ డాక్టర్ రాజ్ కుమార్ గురు స్వామి ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగా లు ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి శివుడి విగ్రహానికి అభిషే కాలు, బిల్వార్చన మహా మంగళ హారతి తదితర పూజలు ఘనంగా నిర్వహిం చారు. ఉదయం గ్రామ పురవీధుల గుండా నిర్వహిం చిన కలశం ఊరేగింపు వైభవంగా కొనసాగింద. కలశం ఊరేగింపు పురస్కరిం చుకొని దారి పొడవునా మహిళలు నిండు కుండలతో రోడ్లు శుభ్రం చేసి తమ భక్తిని చాటారు. కలిసా ఊరేగింపు లో950 శివ స్వాములు పేట తుళ్ళి ఆడుతూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు అనంతరం ఈశ్వర్ మందిర్ లో కొనసాగిన ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూ జలో గవినోల డాక్టర్ మధు సూదన్ రెడ్డి దంపతుల చేతు ల మీదుగా శివుడి విగ్రహానికి అభిషేకాలు మహా మంగళ హారతి, బిల్వార్చన నిర్వహిం చారు. శివ స్వాముల ద్వాదశ జ్యోతిర్లింగాల పూజసుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన మహా పూజో త్సవం కన్నుల పండుగగా కొనసాగగా గురుస్వాములు , శివ స్వాముల ఆధ్వర్యంలో పాడిన భక్తి గీతాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. శివనామస్మరణతో జాజాపూ ర్ గ్రామం మార్మోగింది. మహా పూజ పురస్కరించుకొని శివ స్వాములతో పాటు భక్తులకు గత ఐదు సంవత్సరాల నుండి గవినోళ్ల డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వ ర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది సాయంత్రం ఏడు గంటలకు ఈశ్వర్ మందిర్ లో నందికోల సేవ ఎంతో అత్యంత వైభవం గా నిర్వహించారు ఈ కార్యక్ర మంలో గురు స్వామి శివ స్వాములు చెన్నకేశవరెడ్డి నవీన్ కుమార్ గౌడ్ మహేష్ గౌడ్ ఆలుగడ్డ రవి సురేష్ బుద్ధి రాకేష్ ఆనంద్ కుమార్ భక్తులు గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్ గవినోళ్ళ శ్రీధర్ రెడ్డి కనకప్ప శేషప్ప ఆలుగడ్డ వెంకట్ రాములు లతో పాటు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్:8. పడి పూజ చేస్తున్న శివ స్వాములు
____________________
