ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహణపై నేడు మహబూబ్ నగర్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సన్నాహక సమావేశం. హాజరుకానున్న జిల్లా ఇంచార్జి మంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు. 

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహణపై నేడు మహబూబ్ నగర్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సన్నాహక సమావేశం. హాజరుకానున్న జిల్లా ఇంచార్జి మంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు. 

గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో షెడ్యూల్డ్ ప్రకారం రోజు వారీ  కార్యక్రమాలు  - పకడ్బందీగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా.

మహబూబ్నగర్ మార్చ్ 5 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్) రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులోని ఆదేశాల మేరకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలోవివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
        రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి అమలు చేసేందుకు "ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక" కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని , నిర్దేశించిన తేదీల ప్రకారం రోజూ వారీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై ఈ నెల 6 న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సన్నాహక సమావేశాన్ని మహబూబ్ నగర్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
        ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా వివిధ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాలలో గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు అందరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ప్రభుత్వ షెడ్యూల్డ్ ప్రకారం ఆయా శాఖల 
అధికారులందరూ తమకు నిర్దేశించిన తేదీల్లో
 క్షేత్ర స్థాయిలో  నిబద్ధతతో, బాధ్యతగా కార్యక్రమాలు  పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నదని, ఇందులో ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, ఫైల్స్ క్లియరెన్స్, ఆరోగ్యం, విద్య సంక్షేమం, వ్యవసాయం, మహిళలు ,యువత, క్రీడలు, పర్యావరణం, డ్రగ్స్ నివారణ, రహదారి భద్రత తదితర అంశాలపై షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే గ్రామసభలు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు . ఆయా శాఖల అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టే  ప్రత్యేక పనులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా  రైతులకు అమలు చేసిన కార్యక్రమాలు చేపట్టనున్న కార్యక్రమాలు వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఆరోగ్య కార్యక్రమాలు, ప్రత్యేకించి హెచ్ పి వి వ్యాక్సినేషన్, సోలార్ విద్యుత్ ,జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచే కార్యక్రమాలు, పిల్లలకు గుణాత్మక విద్య అందించడం, డ్రగ్స్ నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, జాబ్ మేళా నిర్వహణ, పర్యావరణంలో భాగంగా నర్సరీల పంపకం, వివిధ పథకాల కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు చేకూర్చిన లబ్ది వంటి వాటిని గ్రామ సభలలో వివరించడం, యువజన వారోత్సవంలో భాగంగా నిర్వహించే  మండల స్థాయి కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారులు భాగస్వాములుr కావాలని, అలాగే అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాల వంటివి నిర్వహించాలని చెప్పారు.
          ఈనెల 6 నుండి 15 వరకు అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో శానిటేషన్ కార్యక్రమాలతో పాటు, ఫైల్ క్లియరెన్స్ కార్యక్రమాలు చేపట్టాలని,పెండింగ్ పైల్స్ సెక్షన్ వారీగా ఆయా శాఖల్లో లిస్ట్ రూపొందించి క్లియర్ చేయాలని అన్నారు
 ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఆయా శాఖల వారిగా సాధించిన అభివృద్ధిపై ప్రజలందరికీ తెలియజేయాలని, అన్ని కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలని సూచించారు
ఆయా శాఖల అధికారులు తమకు సంబంధించిన షెడ్యూల్డ్ ప్రకారం ఆయా రోజుల్లో చేపట్టే కార్యాచరణ  తో సిద్ధంగా ఉండాలని సూచించారు
జిల్లా స్థాయిలో  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా,మండల స్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి నోడల్ అధికారిగా కార్యక్రమాలు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని షెడ్యూల్డ్ వారీగా రోజూ వారీ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో  పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.

       ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా అంశాల వారిగా నిర్వహించాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంచార్జి 
స్థానిక సంస్థల    అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ , రెవిన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ ,
ఆర్.డి.ఓ నవీన్,మున్సిపల్ కమిషనర్ లు,జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.