ఉత్సాహంగా పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు
ఖమ్మం:లోకల్ గైడ్ :
ప్రతి విద్యార్థి ఉత్తమ విధ్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అడిషనల్ డిసిపి ఏఆర్ కుమారస్వామి అన్నారు.*శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ ఉన్నత పాఠశాల స్కూల్ చైర్ పర్సన్ శ్రీమతి నిషిత శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు.* ఈ సందర్భంగా
స్కూల్ అడిషనల్ డిసిపి ఏఆర్ మాట్లాడుతూ..విద్యార్థులు 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు నిర్దేశిత ప్రణాళికలను అనుసరించాలని అన్నారు.
పది ఫలితాలు విద్యార్థి భవితను దిశానిర్దేశం చేస్తాయనీ, విద్యార్థి సమగ్ర అభివృద్ధికి సూచికగా నిలుస్తాయని అన్నారు. *లక్ష్యం సాధించడానికి ఏకాగ్రత అవసరమనీ, ఇష్టపడి చదివి పాఠశాలకు,ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.*
SSC విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతి అందజేశారు, *పదో తరగతి పరీక్షకు వెళ్లే విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, జామెంట్రీ బాక్స్ అందజేశారు.* అనంతరం విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. *పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంస్కృతిక నృత్యాలను, జానపద కళా రూపాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.*
అడిషనల్ డీసీపీ ఏఆర్ పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
*ఈ కార్యక్రమంలో* ఏఆర్ ఏసీపీ నరసయ్య, ఆర్ ఐ కామరాజు, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
