శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 22వ వార్షికోత్సవం
మిర్యాలగూడ మార్చి 5
(లోకల్ గైడ్ తెలంగాణ )
మిర్యాలగూడ పట్టణం విద్యానగర్ లో వెలసిల్లిన శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 22వ వార్షిక బ్రహ్మోత్సవాలను రెండు రోజులుగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటిరోజు బుధవారం నాడు కలశస్థాపన మూలవిరాట్ కు అభిషేకం, గణపతి హోమం నిర్వహించారు. రెండవ రోజు గురువారం నాడు సిద్ది బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణాన్ని వేద పండితులచే శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. భైరవభట్ల సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేడుకని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినట్లు శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు కాటేపల్లి నరసింహమూర్తి శర్మ, పులి కృష్ణమూర్తి శర్మ తెలిపారు. అనంతరం కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాటేపల్లి కృష్ణమోహన్, పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ, విశ్వనాథ వరప్రసాద్, కృష్ణమూర్తి శర్మ మరియు భక్తులు పాల్గొన్నారు.
