శ్లోక పాఠశాలకు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం అందజేత్

తలసేమియా వ్యాధి చిన్నారుల రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్నందుకు గాను

శ్లోక పాఠశాలకు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం అందజేత్

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 4

    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు.

రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.