మోత్కూరు నియోజకవర్గo గా ఏర్పాటు చేయాలి.

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా  మోత్కూరు

మోత్కూరు నియోజకవర్గo గా ఏర్పాటు చేయాలి.

  నల్లగొండ ఉమ్మడి జిల్లా లోకల్ గైడ్ : 

 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా  మోత్కూరు మండలాన్ని ఆత్మకూరు, అడ్డగూడూరు మోత్కూర్ ,గుండాల, మోటకొండూర్ మండలాలతో నూతన మోత్కూర్ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు
 మంగళవారం
బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో  తహశీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభుదాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మారుమూల ప్రాంతమైన మోత్కూర్ మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతర బోయిన సత్యనారాయణ, కొయ్యలకర్ జహంగీర్, కలిమెలా నర్సయ్య, లింగస్వామి, ఎస్ మస్తాన్, స్వామి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం నాంది పూజతో నడయాడిన శ్వేతార్కలయం
హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్): కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ క్షేత్రంలో 2025 గణపతి నవరాత్రి ఉత్సవ కల్యాణోత్సవ వేడుకలు నేటితో  ప్రారంభమయ్యాయి...
మా భూమిలో అక్రమ నిర్మాణాలు ఆపండి..!
ముగియనున్న శ్రావణమాసం బోనాలు
మహిళా శిశు వికాస కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ హితవు
ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్