తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
మిర్యాలగూడ జనవరి 11
(లోకల్ గైడ్,తెలంగాణ)
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు. ఐద్వా, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో హౌజింగ్ బోర్డులోని 15వ వార్డులో ఆదివారం ముగ్గులు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులతోపాటు పాల్గొన్నవారికి కన్సోలేషన్ బహుమతులు అందచేసి ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మహిళలు ముగ్గులు వేశారని కొనియాడారు. మహిళల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందని, ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని అన్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడేవిధంగా ప్రభుత్వం నిధులు కేటాయించాలన్నారు. మహిళల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఐద్వా, డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, ఐద్వా నాయకులు పాదూరి గోవర్ధన, అరుణ, ఊర్మిళ, కౌసల్య, కరీమున్నీసాబేగం, పూలమ్మ,వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ నాయకులు పాల్గొన్నారు.
