యాలాల మండలంలో ఘనంగా విద్యా ప్రమాణాల పోటీలు: ప్రైవేట్ పాఠశాలల అపూర్వ సహకారం.
శుక్రవారం MRC లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాల పై చర్చించారు.
లోకల్ గైడ్/ తాండూర్
తాండూర్ పరిధిలోని యాలాల్ మండలం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మండల విద్యాశాఖాధికారి (MEO) ఎస్. మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం MRC లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాల పై చర్చించారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపితం చేయుటకు, విద్యా ప్రమాణాలను పెంచి, నాణ్యమైన విద్యను అందించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంఈఓ స్పష్టం చేశారు. ఈ నెల 30,31 తేదీలలో 3వ తరగతి విద్యార్థులకు FLS పరీక్షలు మరియు ఏప్రిల్ 4వ తేదీన 5వ తరగతి విద్యార్థులకు టాలెంట్ సెర్చ్ టెస్ట్ పరీక్షలు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఈ పరీక్షలు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) యాలాలలో జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా
ఉదయం 8:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విద్యార్థులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
బహుమతుల ప్రదానం
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు MRC యాలాల ఆధ్వర్యంలో షీల్డ్‌లు, మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందిస్తామని అన్నారు.
కాంప్లెక్స్ స్థాయిలో: 1వ, 2వ, 3వ విజేతలకు.
మండల స్థాయిలో: 1వ, 2వ విజేతలకు.
ప్రైవేట్ పాఠశాలల నుండి: టాప్ 3 విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల ఉదారత
విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి మండలంలోని 6 ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పూర్తి స్థాయిలో అండగా నిలిచాయని అన్నారు. సుమారు 350 మంది విద్యార్థులకు అవసరమైన ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ మరియు ప్రైజెస్ కోసం అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని వారు ముందుకు రావడం విశేషమని ఆయన అభివర్ణించారు.
విద్యా ప్రమాణాల పెంపునకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
