అమరవీరుల దినోత్సవం మరియు గాంధీ వర్ధంతి.

గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు

అమరవీరుల దినోత్సవం మరియు గాంధీ వర్ధంతి.

 ఖమ్మం: లోకల్ గైడ్
జనవరి 30వ తేదీ జాతీయ అమరవీరుల దినోత్సవం మరియు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా త్రివేణి పాఠశాలలో ప్రిన్సిపల్ పి రాజేంద్రప్రసాద్ గారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈIMG-20260130-WA0260 సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశం కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు నిత్యము స్మరించుకోవాలని వారి అడుగుజాడలలో నడవాలని ఆ విధముగా విద్యార్థులు దేశభక్తియుతులైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు జమలాపురం కేశవరావు మొదలైన దేశభక్తులు వారు వారి యొక్క జీవితాలను తృణప్రాయంగా దేశం కోసం వదిలివేసారని వారి అడుగుజాడల్లో నడుస్తూ మనము దేశభక్తులుగా ఎదగాలని సూచించారు.అదే విధంగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా, గాంధీజీ అహింసా మార్గంలో స్వాతంత్రం ఎలా సంపాదించారో, క్విట్ ఇండియా ఉద్యమం ఎలా నడిపారు,అహింసా పరమో ధర్మః అనే  నానుడి ఎలా పాటించారో వివరించారు.ఈ కార్యక్రమంలో కృష్ణవేణి త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, పాఠశాల సి ఆర్ ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ ,పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్వప్న, ముస్తఫా  క్యాంపస్ ఇంచార్జ్ చార్లెస్, సందీప్ మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News