ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ , ఫిబ్రవరి 2 :
సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఖమ్మం డివిజన్ సెక్రటేరియట్ సభ్యులు గూగుల్ తేజ నాయక్, మండల నాయకులు పులకాం సత్తిరెడ్డి, సక్రు, రావుల నాగేశ్వరరావు ఉద్యమ అవసరాల రీత్యా ప్రజలను కలుస్తున్నాం. ఈ సందర్భంలో మాదారం సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మాదారం కు చెందిన వేముల వీరన్న, కోయిల శ్రీను పేరుతో వారు వారు మా పార్టీ సంబంధం లేదని అక్రమంగా తిరుగుతున్నారని గ్రూపులో సమాచారం పెట్టడం జరిగింది. ఈ విషయం పార్టీ డివిజన్ మండల నాయకత్వం మాదారం గ్రామంలో సమావేశం నిర్వహించి గ్రూపులో వచ్చిన ప్రకటన మా పార్టీ సభ్యుల మధ్య సమాచార లోపం సమన్వయ లోపం వల్ల వచ్చిందని పార్టీ గుర్తించింది. మాదారం గ్రామంలో ప్రజలను కలిసే వాళ్ళని మా పార్టీ కూడా మా పార్టీ నిర్ణయం ప్రకారమే అవసరాలు రీచ్ అని కలిశారు, ఈ సమస్యను మా కమిటీలలో పరిష్కరించుకున్నాము. అలాగే మాదారం గ్రామ శాఖ రద్దు చేస్తున్నట్లు కూడా మరో ప్రకటన గ్రూపుల్లో తిరిగింది మాదారంలో మా గ్రామ శాఖ రద్దు కాలేదు కామ్రేడ్ పులకాని సత్తిరెడ్డి అధ్యక్షతన జరిగిన కామేపల్లి కారేపల్లి సంయుక్త మండల కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్, కోలేటి నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి. ఝాన్సీ, జిల్లా నాయకులు కే. శ్రీనివాస్, డివిజన్ నాయకులు కార్యదర్శి గుమ్మడి సందీప్, సహాయ కార్యదర్శి ఎన్ వి రాకేష్, డివిజన్ సెక్రటేరియట్ సభ్యులు తేజ నాయక్, బిక్కసాని భాస్కర్, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.