ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణులకు వరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామీణులకు వరంగా మారిందని జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు.
మిడ్జిల్ మండలంలోని లింబ్యా తండాలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిపేర్కొన్నారు. పేదల జీవితాల్లో భద్రత, గౌరవం తీసుకువచ్చే దిశగా ఈ పథకం విజయవంతంగా అమలవుతోందన్నారు.
లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నరు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, ఎంపీడీఓ గీతాంజలి తహసీల్దార్ స్వప్న ఎంపీ ఓజగదీష్ సాయిలు మల్లికార్జున్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి బాల్ రెడ్డి చిలువేర్ సర్పంచ్ నాగరాజుగౌడ్ పెద్దగుండ్ల తాండ ఉప సర్పంచ్ శ్రీను నాయక్ శ్రీను నాయక్ ఎద్దులపై తాండ సర్పంచి నాను ధర్మానాయక్ మంగళగడ్డ తాండ చంద్రు నాయక్ సర్పంచ్ లింగ తాండ సర్పంచ్ మన్ని శంకర్ నాయక్ రాణిపేట్ సర్పంచ్ మల్లేష్ నాయకులు భాస్కర్ నాయక్ శివప్రసాద్ ఎండి జహీర్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
