ఆర్టిజన్స్ ను తక్షణమే కన్వర్షన్ చేయాలి.
సమస్యలను పరిష్కరించి సమ్మె ను నివారించాలి.
ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 2 (లోకల్ గైడ్).
విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్స్ ను తక్షణమే కన్వర్షన్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద టీవీ ఏసి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ధర్నా వంట వార్పు నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా ధర్నా కు సంగీభావం తెలుపుతూ వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో గత 22 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం గుర్తించింది కానీ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ ను అమలు చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులకు, ఆర్టిజన్స్ కు వ్యత్యాసం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ లను విద్యార్హతలను బట్టి జూనియర్ లైన్ మెన్ లు గా డిప్లోమా వారికి సబ్ ఇంజనీర్లుగా ఆఫీస్ సబార్డినేటర్ లుగా జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. చాలీచాలని వేతనాలతో జీవనాన్ని గడుపుతున్నారని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించేలా కన్వర్షన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు .
ప్రభుత్వం వెంటనే విద్యుత్ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె ను నివారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో , జేఏసీ రాష్ట్ర జిల్లా నాయకులు సతీష్ జిట్టబోయిన లింగస్వామి,జిల్లా నాయకులు గుండ్ల లింగారెడ్డి
,యాదయ్య , టి వి ఏ ఈ జె ఏ సి స్టేట్ కో కన్వీనర్ సాయిలు, స్టేట్ వైస్ చైర్మన్ చింత ఎల్లయ్య, జిల్లా చైర్మన్ లింగస్వామి, జిల్లా జేఏసీ నాయకులు లింగారెడ్డి విజయ్ కుమార్ ప్రవీణ్ సతీష్ ఉమా నాగమణి రమ్య ట్రాన్స్కో కో కన్వీనర్ సహదేవ్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ రమేష్ చంద్రశేఖర్ రెడ్డి లతీఫ్ నగేష్ సైదులు నాగరాజు చాంద్ పాషా జానయ్య వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
