గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు ఘన సన్మానం.
వీరేశం పుష్ప దంపతులకు నకిరేకల్ వారి నివాసంలో చేనేత శాలువాతో సత్కరించి ,గాంధీ విగ్రహాన్ని అందజేసి ఘన సన్మానం
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ , గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌గా ఎంపికైన ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులకు నకిరేకల్ వారి నివాసంలో చేనేత శాలువాతో సత్కరించి ,గాంధీ విగ్రహాన్ని అందజేసి ఘన సన్మానం నిర్వహించారు.రైతు దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన ఆల్బమ్‌ను మర్యాదపూర్వకంగా అందజేశారు. సమాజానికి చేసిన సేవలను గుర్తిస్తూ, పాల్గొన్నవారు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అత్యవసరమని, రైతులకు ఆర్గానిక్ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిలో , వ్యవసాయ క్షేత్రంలో వీలైనంతవరకు సేంద్రియ పద్ధతిలోకూరగాయలు పండించుకోవాలని,అలాగే ప్రభుత్వం రైతులకు సరైన మార్గదర్శకాలు, సాంకేతిక సహాయం అందించాలని , గో ఆధారిత వ్యవసాయానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. తెలంగాణలో గాంధీజీ ఎత్తైన విగ్రహానికి మద్దతుగా ప్రతి నియోజకవర్గము నుండి 1156 విగ్రహాలను సేకరిస్తున్నట్లు దీనికి ప్రతి ఒక్క గాంధీయవాదులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గాంధీ సంస్థల రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, ఎర్ర శంభు లింగారెడ్డి, పుచ్చకాయల వెంకటరెడ్డి, మారుపాక నరసయ్య, కన్నయ్య, శివకోటి ఆంజనేయులు, ఝాన్సీ రాణి, జివ్వుగూడెం సర్పంచ్ చింత అనిల్, నార్కట్‌పల్లి సర్పంచ్ భరత్, పి. గోవర్ధన్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్,అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
