నిర్మల్ పోలీస్... మీ పోలీస్. గాంజా వినియోగం పై ఉక్కుపాదం

జిల్లా వ్యాప్తంగా గాంజా గస్తీ కార్యక్రమం కిరాణా దుకాణాలు, పాన్ షాప్ ల పై దాడులు…గాంజా అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా

నిర్మల్ పోలీస్... మీ పోలీస్. గాంజా వినియోగం పై ఉక్కుపాదం

మత్తు పదార్థాలపై రాజీ లేదు–గాంజా కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటాం ––– జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్

నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3(లోకల్ గైడ్)

     నిర్మల్  జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు గాంజా వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గాంజా వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా *గాంజాగస్తీ* కార్యక్రమాన్ని  నిర్వహించారు.

         ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌.హెచ్‌.ఓ లు,పోలీస్ సిబ్బంది కిరాణా దుకాణాలు, పాన్ దుకాణాలు,అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు (రైడ్లు) చేపట్టారు.ఈ సందర్భంగా ప్రజలకు గాంజా వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గాంజా, మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు, యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గాంజా వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

       అలాగే, ఎవరైనా గాంజా విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని *జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్* తెలిపారు.

Tags:

About The Author

Latest News