కోటకొండ డబుల్ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం ఎందుకు...?
అవస్థలు పడుతున్న వాహనదారులు
By Ram Reddy
On
వెంటనే పూర్తిచేయాలనీ డిమాండ్
నారాయణపేట మార్చి 4:
అప్పకి పల్లి నుండి కోయిల కొండ కు వెంటనే డబుల్ రోడ్డు పనులు ఏళ్ళు గడుస్తున్నా పూర్తి చేయక పోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దాదాపు 4 ఏళ్లు అవుతున్నా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు 20 22 - 23 సంవత్సరంలో మంజూరు అయింది.అట్టి రోడ్డు పనుల్లో బొమ్మను పాడ్ నుండి బోయిలపల్లి వరకు రోడ్డు పనులు ఆపివేశారు. అలాగే కోట కొండ గ్రామ శివారులో ఫారెస్ట్ పర్మిషన్ రాలేదని పనులు కూడా నిలిపివేశారనీ తెలిపారు. అదేవిధంగా కోట కొండ గ్రామంలో కూడా ఎలాంటి రోడ్డు పని ఇంతవరకు ప్రారంభించలేదు. పనులు ఆపడం వలన రోడ్డుపై వెళ్ళే ప్రజలకు దుమ్ము , ధూళి తో పాటు ప్రయాణం నరక ప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు వైద్యం కోసం వెళ్ళడా నికి , అంబులెన్సు కూడా గ్రామాలకు రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గత వర్షాకాలంలో రోడ్డు బుర దమ యమయ్యి బస్సులు రాక నారాయణ పేటకు వెళ్లే విద్యా ర్థులకు ఎంతో ఇబ్బంది పడ్డా రని వాపోతున్నారు .రోడ్డు పనులు వెంటనే పూర్తిచేయా లని చాలా సార్లు గ్రామస్తులు వివిధ పార్టీలు ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే విషయమై కలెక్టర్,ఎమ్మెల్యే లకు ఎన్నిసార్లు తెలియ జేసిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని నేటికి ఎలాం టి పురోగతి లేదని అంటు న్నారు. కోటకొండ డబుల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించి రోడ్డు ను పూర్తి చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని అప్రాంత ప్రజలు, వాహన దారులుహెచ్చరిస్తున్నారు.
అధికారులు,పాలకుల నిర్లక్ష్యం తగదు.
* బిజెపి జిల్లా నాయకులు శ్రీనివాసులు
నారాయణపేట మండలంలోని అప్పక్ పల్లి నుంచి కోయిలకొండ వరకు జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణంలో అధికారులు,పాలకుల నిర్లక్ష్యం తగదని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కే.శ్రీనివాసులు అన్నారు.కొన్నేళ్లుగా అధికారులకు పాలకులకు అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యం లో వినతులు చేస్తున్నా పట్టించుకోక పోవడం విచారకరం అన్నారు.
అదే రోడ్డు పై బైఠాయించి ధర్నాలు , రాస్తారోకోలు నిర్వహిస్తామని, నిర్వహిస్తా మని హెచ్చరించారు.
ఫోటో రైట్ అప్:1.కే.శ్రీనివాసులు
_____________________
Tags:
About The Author
Latest News
15 Mar 2026 21:04:22
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ)
ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి...
