ఘనంగా సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించిన

ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించిన ప్రముఖులు

ఘనంగా సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించిన

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సివిల్ రైట్స్ డే సందర్భంగా గచ్చిబౌలి పరిధిలోని మసీద్ బండ కమిటీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అధికారులు, సామాజిక నాయకులు పాల్గొని పౌర హక్కులు, సామాజిక సమానత్వం, రాజ్యాంగ విలువలపై ప్రాధాన్యతతో ప్రసంగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే విద్యతో పాటు హక్కులపై అవగాహన చాలా అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించ బడినవని, వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు.
సమాజంలో పెద్దలు, చిన్నవారు, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మహిళల పట్ల గౌరవం, పిల్లల పట్ల సంరక్షణ, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణతోనే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని పేర్కొన్నారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమం కేవలం ఒక వేడుకగా కాకుండా, సమాజంలో చైతన్యం తీసుకు వచ్చే వేదికగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆచరణలో అమలవ్వాలంటే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని ఈ సభ స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం, సామాజిక సంఘాలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్న సందేశాన్ని ఈ కార్యక్రమం బలంగా ఇచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ ఆర్.ఐ.చంద్రశేఖర్ రెడ్డి,
అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీకాంత్, 
గచ్చిబౌలి ఎస్ఐ వెంకటేశ్వర్, 
ఎస్సీ విద్యాశాఖ హాస్టల్ ఇన్చార్జి చంద్రయ్య, గోపినగర్ జన చైతన్య ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News