నారాయణపేట ఫిబ్రవరి 16:
నారాయణపేట మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నికల్లో తానొవ్వక నొప్పించక అన్న రీతిలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి చమత్కారం ప్రదర్శించా రు.కచ్చితంగా చైర్మెన్ , వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో కీలకంగా మారిన బి ఆర్ ఎస్ ఇద్దరు కౌన్సిలర్లూ ఉండగా వారి మద్దతు ఎవరికి ఇవ్వకుండా ఇద్దరూ కొన్నిలర్లను గైర్హాజరు చేయించారు.నిన్నటి వరకు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ల మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందని పుకార్లు జరిగాయి.దాంతో కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ పదవిపై ఆశలు పెంచుకున్నాయి.అదే ధీమాతో మున్సిపాలిటీకి హాజరయ్యారు.తీరా చూస్తే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్, బిజెపి కి సమానదూయం పాటిస్తూ ఖంగు తినిపించా రు.రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలకు ఆయన సమాన దూరం పాటించారు.
ఫోటో రైట్ అప్:3.మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి
_____________________