పెద్దాయపల్లి లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల ప్రారంభం.

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లీ అనిరుద్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు శ్రీకారం.

పెద్దాయపల్లి లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల ప్రారంభం.

సీ ఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన నిధులతో విద్యారంగం లో కీలక ముందడుగు. మెగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాల భవనం ప్రారంభం.

జడ్చర్ల జనవరి 9 లోకల్ గైడ్.

జడ్చర్ల నియోజక వర్గం బాలానగర్ మండల పరిధిలోని పెద్దాయపల్లీ సమీపంలో సుమారు రూ.200 కోట్ల నిధులతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను శుక్రవారం రోజు జడ్చర్ల శాసనసభ్యులు జానంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం ఆర్ అండ్ బి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు. జడ్చర్ల నియోజకవర్గానికి విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు రూ.200 కోట్ల నిధులను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 

ఈ భారీ విద్యా ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలను మెగా కంపెనీ చేపట్టిందని, రెండు సంవత్సరాల వ్యవధిలో నాణ్యమైన నిర్మాణ ప్రమాణాలతో పనులను పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెల్లడించారు. 

ఈ పాఠశాల నిర్మాణం పూర్తయిన అనంతరం జడ్చర్ల నియోజకవర్గంలోని అనేకమంది నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందుబాటులోకి రానుందని, విద్యారంగంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి