అత్తా పూర్ సర్కిల్లో 2025-26వ ఆర్థిక సంవత్సరంలో రూ. 44.26 కోట్ల ఆస్తి పన్ను వసూల్. 

మార్చీ 31వ తేదీ ఒక్కరోజే రూ. 3.54 కోట్ల ఆస్తి పన్ను వాసులు.  ఆస్తి పన్ను వసూలుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు.

అత్తా పూర్ సర్కిల్లో 2025-26వ ఆర్థిక సంవత్సరంలో రూ. 44.26 కోట్ల ఆస్తి పన్ను వసూల్. 

సకాలంలో ఆస్తి పన్ను చెల్లించిన అత్తాపూర్ సర్కిల్-20 ప్రజలకు ధన్యవాదములు - డిప్యుటీ కమీషనర్ సమ్మయ్య.    

   రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):                                      ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో అత్తా పూర్ సర్కిల్ ల్లో రూ. 44.26 కోట్లు వసూలైనట్లు సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సమ్మయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.40.14 కోట్ల వసూళ్లు జరిగాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో రూ. 4.12 కోట్ల (సుమారు 10%) అదనంగా వాసులు చేయడం జరిగిందని వెల్లడించారు. 
అదే విధంగా మార్చీ 31 వ తేదీన ఒక్క రోజులోనే రూ. 3.54 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు చేయడం విశేషమన్నారు. 
సకాలంలో ఆస్తి పన్ను చెల్లించిన అత్తాపూర్ సర్కిల్ ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదే విధంగా ఆస్తి పన్ను వసూళ్లలో అహర్నిశలు కృషి చేసిన అత్తా పూర్ సర్కిల్  ఏఎంసీలు, టీఐలు, బీసీలు ఇతర సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో, ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ప్రభుత్వం 5% రాయితీ కల్పించిందని తెలిపారు. ఈ రాయితీ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నామన్నారు.

Tags:

About The Author

Latest News