రాజరాజేశ్వరి స్వామి దేవాలయ కమిటీ నియామకం.
నూతన కమిటీని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రసిద్ధి చెందిన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రకటించారు.ఆలయ కమిటీ చైర్మన్‌గా సోమగూడెం కు చెందిన దూడ మహేష్,డైరెక్టర్ లుగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన పెద్ది రాజేందర్,తాండూర్ కు చెందిన కోరల పుష్ప,కన్నాలకు చెందిన మంద ఉదయ్ వికాస్,అంకుశం కు చెందిన సిలువేరు అరవింద్,చిన్న బూదకు చెందిన మీస రమేష్,అదేవిధంగా రామకృష్ణాపూర్ కు చెందిన దాత సుంకరి రాజేష్ లతో కూడిన కమిటీ సభ్యులను ఎన్నుకొని ఎమ్మెల్యే అధికారికంగా వారికి లెటర్ ప్యాడ్‌లను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కన్నాల గ్రామపంచాయతీలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని,ఆలయ అభివృద్ధి,భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నూతన కమిటీని నియమించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం 2026 మహాశివరాత్రి పర్వదినాన్ని నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం,తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు.భవిష్యత్తులోను భక్తుల సౌకర్యం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
