ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలి -
జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
By Ram Reddy
On
రంగారెడ్డి జిల్లా బ్యూరో, ( లోకల్ గైడ్ ):
ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, డీఆర్ఓ సంగీతతో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు సమస్యల పరిష్కారం నిమిత్తం చేసుకున్న దరఖాస్తులను
పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (52) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిశీలించి కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (52) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ– 23, ఇతర శాఖలకు – 29, మొత్తం 52 దరఖస్తులు అందాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
27 Mar 2026 21:51:04
పాల్గొన్న గ్రామ అతిరథ మహారథులు భక్త జన సంద్రాన్ని తలపించిన దృశ్యం
