రాజేంద్ర నగర్ ఫిబ్రవరి 11, (లోకల్ గైడ్ ): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ ల వల్ల 40 కోట్ల సంఘాటీత, అసంఘాటీత కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడేలా చట్టాలు తీసుకురావడం ముమ్మాటికీ సరైంది కాదని సి ఐ టి యూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాజాల రుద్రకుమార్, కార్యదర్శి ఎం. చంద్రమోహన్ అన్నారు. నేడు చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని జీపు జాతను కాటేదాన్ చౌరస్తా లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం -1926 ప్రకారం యూనియన్లు ఏర్పాటుతో కార్మికుల హక్కులు పొందారు, అయితే ఈ లేబర్ కోడ్ లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కు పాదం మోపేలా లేబర్ కోడ్ లను తీసుకురావడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత పట్ల యజమానియాలకున్న అన్ని బాధ్యతలను తొలగించడం తో పాటు హార్ & ఫైర్ పద్ధతిని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలకు మంగళం పాడారని ఆరోపించారు. కోర్ యాక్టివిటీలో సైతం విచ్చులవిడిగా కాంట్రాక్ట కార్మికులను నియమించుకోవడం చట్టపరం చేశారన్నారు. ఈ విధానం వలన పెట్టుబడిదారులకు అనేక రేట్లు లాభాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. 100 మంది కార్మికుల పనిచేసే పరిశ్రమను యజమాన్యం ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని నిబంధనను ఎత్తి వేసి 300 లకు పెంచారన్నారు. మేడే స్ఫూర్తి తో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని పోరాట స్ఫూర్తిని నేటి కార్మిక వర్గం తెలియకుండా చేసే ప్రయత్నాలకు పూనుకున్నారని మండి పడ్డారు. మన రాష్ట్రంతో పాటు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పని విధానం 10 గంటలకు స్పీడ్ ఓవర్ టైంను 12 గంటలకు పెంచుతూ చట్ట సవరణ లు చేశారు. ఈ లేబర్ కోడ్ ను ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ మరియు ప్రసూతి ప్రయోజనాల వంటి అన్ని ప్రయోజనాలను కూడా మింగేశారని దుయ్య బట్టరు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల పని భద్రత ,పిఎఫ్, ఈఎస్ఐ , వెల్పర్ బోర్డులో పేర్కొన్న పథకాలు ఎలా లభిస్తాయని అంశంలో లేబర్ కోడ్స్ నిర్దిష్టమైన ప్రసవన లేదు అలాగే అంగన్వాడీ ,ఆశ ,మధ్యాహ్నం భోజనం, ఐకెపి, వి ఓఏ ,ఆర్ పి ,ఉపాధి హామీ నేషనల్ హెల్త్ కమిష లాంటి స్కీములతో పనిచేస్తున్న వారిని కనీసం కార్మికులు కూడా గుర్తించలేదన్నారు. 2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సారత్రిక సమ్మెను కు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు లో రాష్ట్రంలో అన్ని స్థాయిలలో నీ అన్ని కార్మిక సంఘాలు, వాటి అనుబంధ యూనియన్లు యావత కార్మిక లు భాగ్యసామ్యం కావాలని కేంద్ర ,రాష్ట్ర కార్మిక సంఘాలు మనం కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఆటో జాత కార్యక్రమం లో అత్తాపూర్ డివిజన్ కన్వీనర్ బచ్చలకూర స్వామి,సులేమాన్ నగర్ డివిజన్ కన్వీనర్ కాలే రాజు, రాజేంద్రనగర్, మైలార్ దేవుపల్లి, శాస్త్రి పురం డివిజన్ల కన్వీనర్ లు సుక్క మోహన్, వెంకటయ్య, భాస్కర్, భవన నిర్మాణ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, పరిశ్రమల కార్మికులు, హమాలీ, జీ హెచ్ ఎం సి కార్మికులు పాల్గొన్నారు.