శ్రీరామనవమి ఉత్సవాలకు ఐటీడీఏ పీవోకు ఆహ్వానం

శాస్త్రోక్తంగా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు పీవో బీ రాహుల్ సూచనలు

శ్రీరామనవమి ఉత్సవాలకు ఐటీడీఏ పీవోకు ఆహ్వానం

 

 

భద్రాచలం : లోకల్ గైడ్ :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి దామోదర్ రావు, అర్చక స్వాములు సోమవారం నాడు ఐటీడీఏ పీవో చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలకు విచ్చేయాలని అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం వంటి మహత్తర ఆధ్యాత్మిక పర్వదినాలు ప్రజలలో భక్తి, శ్రద్ధ, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. దేవస్థానంలో నిర్వహించే ఈ ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఘనంగా నిర్వహించాలని దేవస్థాన అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆలయ ఆచారాలు, పూజా విధానాలు, ఉత్సవ కార్యక్రమాలు పురాతన సంప్రదాయాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దర్శన సౌకర్యాలు, శాంతి భద్రతలు, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భవాని రామకృష్ణ, అమరవాది రామాచార్యులు, ఎస్‌టీజీ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News