లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ 2026
మరియు నూతన సంవత్సర సంక్రాత్రి శుభాకాంక్షలు తెలిపారు*
By Ram Reddy
On
యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ చేతులమీదుగా ఘనంగా కార్యక్రమం* *మరియు లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక రంగారెడ్డి జిల్లా యాడ్స్ మేనేజర్ మరియు రిపోర్టర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్
లోకల్ గైడ్-తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ మాట్లాడుతూ, లోకల్ గైడ్ దినపత్రిక ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో విశ్వసనీయతతో పని చేస్తోందని ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న మంచి, చెడు అంశాలను సమతుల్యంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాలుగో స్థంభంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లోకల్ గైడ్ దినపత్రిక ఇదే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
లోకల్ గైడ్ దినపత్రిక మేనేజర్ మరియు రిపోర్టర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పత్రికను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజల గొంతుకగా నిలవడమే తమ ధ్యేయమని చెప్పారు. తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పత్రికను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా లోకల్ గైడ్ మేనేజర్ పట్నం ప్రతాప్ శ్రీనివాస్ పాల్గొని పత్రిక అభివృద్ధికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
అలాగే లోకల్ గైడ్ దినపత్రికకు చెందిన రిపోర్టర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని, పత్రిక విశ్వసనీయతను మరింత పెంచేలా పని చేస్తామని తెలిపారు.
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో పాల్గొన్నవారు యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రికకు భవిష్యత్తులో మరింత ముందుకు దండుగుల శ్రీశైలం దండుగుల శివ పోవాలని మరింత గుర్తింపు రావాలని పలువురు అభినందనలు తెలిపారు..
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
