రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని కాపాడుకుంటాం – ప్రభుత్వ విలీన ప్రతిపాదనపై బీజేపీ సమరభేరి
రాజేంద్రనగర్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ "మహాధర్నా" – వేలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు*
ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పంతంగి రాజు భూపాల్ గౌడ్ ప్రజల అభిప్రాయం లేని విలీనం అప్రజాస్వామికం: బీజేపీ నేతల ద్వజం
రాజేంద్రనగర్ జనవరి 12, (లోకల్ గైడ్):
రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సమరశంఖం పూరించింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ పోన్నమోని మల్లేష్ యాదవ్ అధ్యక్షతన ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం భారీ " మహాధర్నా " నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...
ప్రజల భూములు, ఉపాధిని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్‌లో విలీనం చేయడం అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగిఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల భూములు, స్థానిక ఉపాధి అవకాశాలు, రాజకీయ ప్రాధాన్యతలను దెబ్బతీసేందుకే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేస్తోందని విమర్శించారు. జిల్లాకు తనకంటూ ఒక ప్రత్యేక సామాజిక, భౌగోళిక గుర్తింపు ఉందన్నారు. కనీసం గ్రామసభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజల హక్కుల కోసం బీజేపీ తుది శ్వాస వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.
జిల్లా అధ్యక్షులు పంతంగి రాజు భూపాల్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ రంగారెడ్డి జిల్లా ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ జిల్లాలోని గ్రామీణ, అర్ధపట్టణ ప్రాంతాలను హైదరాబాద్‌లో కలిపి గందరగోళం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు. విలీనం జరిగితే స్థానిక సమస్యలు పక్కన పడిపోయి ప్రజల స్వయం నిర్ణయ హక్కు హరించబడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బిజెపి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అందేలా శ్రీరాములు యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గౌడ్(మామా), గోల్కొండ–గోషామహల్ ప్రబారి వై. శ్రీధర్, జిల్లా కార్యదర్శి కొమురయ్య, వనపర్తి జిల్లా ప్రబారి బొక్క బాల్ రెడ్డి, బీజేవైఎం మాజీ రాష్ట్ర అధ్యక్షులు చేవెళ్ల మహేందర్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బుర్ర మహా లింగం గౌడ్, కడెం పురుషోత్తం, నంద కిషోర్, బైతి శ్రీధర్,కే దేవేందర్,భాస్కర్ రెడ్డి, వి చంద్రయ్య, బల్దేవ్ రెడ్డి, రాహుల్,డి సత్యనారాయణ, ఎస్ రాజశేఖర్ రెడ్డి,అడికే జనార్దన్ ఎం. సంగీత, అత్తాపూర్ కార్పొరేటర్ సరితా రెడ్డి ,వనిత రెడ్డి, బి.శ్రీనివాస్ యాదవ్, వంశీ యాదవ్,సభదా విజయకుమార్,సులిగే వెంకటేష్,పసుపుల సందీప్,సురెడ్డి వినయ్ రెడ్డి,గోదా పాండు యాదవ్,సదాల రాజశేఖర్, బొమ్మరాజు నర్సింహ,నెల్లుట్ల జగన్, జోగి రవి,చేడం వెంకట్ రమణ గుప్తా, సోల్కర్ రెడ్డి,బాబు రావు, సంతు గౌడ్,రాజి రెడ్డి,పి.రామారావు, ఆదిముల చంద్రశేఖర్, గోకుల్ మహేష్ యాదవ్,బాచ్చిగాళ్ల రమేష్,విక్రమ్ చారి,నిఖిల్,రాజు పహిల్వాన్, మరియు వివిధ మండలాల, విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
