సత్యసాయి కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తి సహకారం - అభివృద్ధి పనుల శంకుస్థాపనలో  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్.

తనవంతు పూర్తి సహకారం ఉంటుందని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి. ప్రకాష్ గౌడ్  అన్నారు.

సత్యసాయి కళ్యాణ మండపం నిర్మాణానికి పూర్తి సహకారం - అభివృద్ధి పనుల శంకుస్థాపనలో  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్.

 
 రాజేంద్రనగర్ ఫిబ్రవరి 20, ( లోకల్ గైడ్ ) :     
             ప్రజల ప్రయోజనార్ధనం సత్యసాయి పరస్పర సహాయక, సహకారం పొదుపు సంఘం లిమిటేడ్ చేపట్టే కార్యక్రమాలకు  తనవంతు పూర్తి సహకారం ఉంటుందని రాజేంద్రనగర్ శాసన సభ్యుడు టి. ప్రకాష్ గౌడ్  అన్నారు. ప్రగతి భాటలో పయనిస్తున్న ఆ పొదుపు సంఘం ఆర్థికంగా మరింత ఉన్నతి సాధించాలని కాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. గురువారం  మార్కండేయనగర్ లోని  శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగాణంలో  సత్యసాయి పరస్పర సహాయక సహకారం పొదుపు సంఘం ఆర్థిక సహకారంతో నిర్మించ తలపెట్టిన  ‘సత్యసాయి కళ్యాణ మండపం‘ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి లక్ష్యంతో  కళ్యాణ మండపం నిర్మించాలని  సంఘ పాలకవర్గ  25వ వార్షిక  మహా సభలో  తీర్మాణం ప్రవేశ పెట్టి  ఏకగ్రీవ ఆమోదంతో  కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చడానికి  ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు. స్థానికంగా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు అత్యధికంగా నివాసం ఉండే మార్కండేయనగర్ లో ప్రస్తుతం దేవాలయాల నిర్వాహణకు చేయుతనిస్తున్న సత్య సాయి పొదుపు సంఘం తలపెట్టిన కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసి ఇతర బస్తీలు, కాలనీలకు ఆదర్శనీయంగా నిలవాలని కోరుకుంటున్నట్లు  ఆయన పేర్కొన్నారు. సత్యసాయి పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో  సంఘం సలహదారుడు, ఆలయ కమిటీ అధ్యక్షుడు  గద్దె క్రిష్ణ, పొదుపు సంఘం వ్యవస్థాపకుడు, సలహాదారుడు గద్దె యాదగిరి, సలహాదారులు ఏర్వ సత్యనారాయణ, పగిడిమర్రి వాసు, ఉపాధ్యక్షుడు  మునగపాటి విష్ణు, ప్రధాన కార్యదర్శ కోట శ్యామ్ కుమార్, సహాయ కార్యదర్శి  కర్నాటి శ్రీనివాస్,  కోశాధికారి  కోట పవన్ కుమార్, పాలకవర్గ సభ్యులు  విడెం రమేష్, గంజి నరేష్, శిరందాసు నరేందర్,  కైరంకొండ శంకర్, కంది అశోక్,  బాత్కు విజయ్ కుమార్,  గంజి ధనంజయ్, బూసం భాను చందర్ , స్థానికులు కోట జగదీష్, మామిడిశెట్టి శ్రీనివాస్, తిరునగర్  గోపాల్, వర్కాల చందు,  తిరునగర్ లక్ష్మణ్, శిరందాసు ప్రభాకర్, ఉడుత సురేష్, మూశం నరేష్,  తోపాటు మైలార్ దేవ్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ధనంజయ్, నాయకులు టి. ప్రేమ్ గౌడ్ , టి. సంతోష్ గౌడ్, మసున వెంకటేష్, బాస శ్రీనివాస్, కళ్లెం లక్ష్మారెడ్డి, అడికె అర్జున్, బోనకుర్తి రాము, అనిల్ ,శేఖర్, నాని, ఎల్లప్ప , కలీల్, స్థానిక మహిళలు గంజి పద్మమ్మ, గద్దె పద్మ,  కుకుడాల వెంకటమ్మ, ఏర్వ ఇందిర, పగిడిమర్రి ఉమాదేవి, పారెపల్లి చంద్రకళ, అవ్వారి సావిత్రీ, కూనల అనిత,చల్లారత్నం, పులిజాల మాధవి  తదితరులు పాల్గొన్నారు.
....................................................
Tags:

About The Author

Latest News