సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ విజయేందిర భోయి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

IMG-20250820-WA0391  నవాబ్ పేట్ ఆగస్టు 20:(లోకల్ గైడ్):
 ( జడ్చర్ల) నవబుపేట్ మండలం లో పదవ తరగతి  చదువుతున్న విద్యార్థులు పరీక్షలలో 100. శాతం ఫలితాలు సాధించాలి కలెక్టర్  పేర్కొన్నారు. మండల పి.హెచ్.సి.,జడ్.పి.ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ 
వర్షకాలంలో  వచ్చే ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,పి.హెచ్.సి.కి వచ్చే
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని   కలెక్టర్ వైద్య సిబ్బందిని  ఆదేశించారు.బుధవారం  మండల కేంద్రం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నీ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం యన్మన్ గండ్ల గ్రామంలో 
ఇందిరమ్మ ఇండ్ల పి. ఎం.ఏ.వై సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య ఉప కేంద్రంలో  లో గర్భిణీ స్త్రీ గురించి, ఓపీ మందుల లభ్యత, మెడికల్ ఆఫీసర్,వైద్య సిబ్బంది తో అడిగి  తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రాన్ని  పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు మండలంలో డెంగ్యూ కేసులు,ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.డెంగ్యూ,సీజనల్ వ్యాధులు వర్షాకాలంలో వ్యాపించే  అవకాశం ఉందని,
 గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు . ప్రాథమిక పాఠశాలల సందర్శించి  విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు.  పాఠశాలలో బోధన, ప్రణాళికలో  ఏదైనా ఇబ్బంది ఉందా, సమస్యలు న్నాయా అని విద్యార్థులకు పరీక్ష లలో  మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు.గత సంవత్సరం ఎస్.ఎస్.సి లో ఉత్తీర్ణత శాతం,విద్యార్థుల సంఖ్య గురించి తెలుసుకున్నారు  సంవత్సరం 
86 శాతం ఉత్తీర్ణత సాధించారని, మొత్తం 123 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు.  పదో తరగతి ఉత్తీర్ణ శాతం పెంచాలని,నూరు శాతం ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం యన్మన్ గండ్ల  గ్రామంలో
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను పి. ఎం. ఏ.వై సర్వే ఏ విధంగా చేస్తున్నారు ప్రత్యక్షంగా పరిశీలించారు.అప్ లో
ఫోటో క్యాప్చరింగ్ చేయటం,ఫేస్ అప్డేటెడ్ 
చేయటం లో టెక్నికల్ ఇబ్బందులు గమనించారు.సర్వే గురించి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని సుష్మ  భారత్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో   ఎం.పి.డి.ఓ  జయరాం నాయక్, ఎమ్మార్వో శ్రీనివాస్, మండల, అధికారులు ఉన్నారు

Tags:

About The Author

Latest News

అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం-రాష్ట్ర రెవిన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  
రంగారెడ్డి    లోకల్ గైడ్ :    రానున్ను రోజుల్లో మూడు విడతల్లో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల...
వెళ్లి రావయ్యా గణపయ్య,కోట్లాది భక్తుల పూజలు ఘనంగా జరిగాయి
పట్టణాలలో పాలన సమర్థవంతంగా జరగాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జి యస్ టీ తగ్గింపుపై సంతోషం వ్యక్తం చేసినవివిధ రంగాల వ్యాపారస్తులు
గ్రామ పాలన అధికారులు పనిపై పూర్తి శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలి.
సొల్లు మాట్లాడే వారికి ఇది గుణపాఠం 
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెరిగిన హమాలి రేట్లు.