ఖమ్మంలో ఘనంగా సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవం

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ  హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఖమ్మంలో ఘనంగా సీతారామచంద్ర స్వామి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవం

 

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ సీతారాంపురం (అగ్రహారం)లో డివిజన్ ప్రజలు, ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతారామచంద్ర స్వామివారి దేవస్థాన ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ  హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ దాసాంజనేయ స్వామి, శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మైసమ్మ, శ్రీ నాబిశిరి (బోడ్రాయి) విగ్రహాలను మేయర్ దర్శించుకుని, నవధాన్యాలు, పసుపు, కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో అంజిరెడ్డి శశిరెడ్డి, మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. స్థానిక కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు యాగ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలో కార్పొరేటర్లు గజ్జల లక్ష్మి, దాదే అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన