కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి గుడి సన్నిధిలో అత్యంత వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం

ముఖ్య అతిథిగా తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి  (మాజీ జడ్పిటిసి, కేశంపేట్ మండలం) దంపతులతో కలిసి పాల్గొన్నారు.

కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి గుడి సన్నిధిలో అత్యంత వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం

 షాద్నగర్ లోకల్‌గైడ్ :

IMG-20260217-WA0201కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం ఘనంగా జరగగా, పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి  (మాజీ జడ్పిటిసి, కేశంపేట్ మండలం) దంపతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ మహాలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

About The Author

Latest News