సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు గడువు పెంచాలి. 

సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు గడువు పెంచాలి. 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో నిలిచిన పత్తి పంట కొనుగోళ్ళు ఆపితే దళారుల రాజ్యం పాలవుతుందని పత్తి కొనుగోలు ప్రక్రియను మార్చి నెల చివరి వరకు కొనుగోలు సాగించాలని లేకుంటే పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు.జిల్లాలో ఇప్పటికి 40శాతం పత్తి రైతుల ఇండ్లలోనే నిల్వలుగా ఉందని వర్షాల కారణంగా,కూలీల కొరతతో పాటు రవాణా సమస్యల వల్ల పత్తి మొత్తం కొనుగోలు కేంద్రాలకు తరలించక పోయారని పేర్కొన్నారు.అధిక వర్షాలతో పత్తి ఉత్పత్తి ఆలస్యంగా జరిగిందని ఇప్పటికీ చేనులలో పత్తి ఉందని ఇలాంటి పరిస్థితుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు కేంద్రాలు మూసివేస్తే ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు రైతులను దోచుకునే అవకాశం ఉందని,ఇప్పటికే కొందరు వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువకే పత్తి కొనుగోలు చేస్తున్నారని,పత్తి పండించడానికి రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారని,సరైన ధర రాకపోతే అప్పుల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి కోతలు విధించకుండా పత్తి కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని,ఏదైనా సమస్య ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకొని మార్చి చివరి వరకు సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ