బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు బస్సులు ప్రారంభం..
బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ రవాణా సౌకర్యాలు ఉన్నాయని,అధికారులు బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుండి 79ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.భక్తులకు మెరుగైన,సురక్షిత ఆర్టీసీ సేవలను అందిస్తుందని,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపు ఉందని తెలిపారు.మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బెల్లంపల్లి కొత్త బస్టాండ్ వద్ద తగిన సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు.భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని,మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని స్పష్టం చేశారు.బెల్లంపల్లి నుండి మేడారం జాతరకు నిరంతరంగా బస్సులు నడుస్తాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్,ఆర్టీసీ ఎండీ రాజశేఖర్,ఆర్టీసీ అధికారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.
