నేడు డిసీసీ అధ్యక్షులుగా ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణపేట జనవరి 11:
నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా నియామ కం అయిన కె. ప్రశాంత్ కుమా ర్ రెడ్డి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటలకు స్థానికమెట్రో ఫంక్షన్ హల్ లో జరిగే ప్రమాణ స్వీకార కార్య క్రమానికి ముఖ్య అతితు లుగా రాష్ట్ర మంత్రి వాకి టి.శ్రీహరి,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నా రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, నియోజకవర్గ ఇంచార్జీలు ఏనుముల తిరుపతి రెడ్డి, కుంభం. శివకుమార్ రెడ్డి లతో పాటు ఉమ్మడి జిల్లా డిసీసీ అధ్యక్షులు, గ్రంథాలయా చేర్మెన్లు, తదితరులు పాల్గొంటారని తెలిపారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలఅధ్యక్షులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరు కూడా పెద్ద హాజరై దిగ్వి జయం చేయాలని కోరారు.
___________________
