సీసీ కెమెరానే పోలీస్.చీమ చిటుక్కు మన్న పట్టేస్తారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి. దుగ్గపూర్ లో సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు.
పెద్దేముల్ మండల ఎస్సై శంకర్.
లోకల్ గైడ్/తాండూర్:
ఒక సీసీ కెమెరా కొంతమంది పోలీసులతో సమానం. ప్రస్తుతం ఇదే రూట్ ఫాలో అవుతున్నారు పోలీసులు. కేసు ఏదైనా విచారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి సీసీ కెమెరాలు. హత్యలు, బ్యాంకు రాబడిలు, దొంగతనాలు, కిడ్నాప్ ఇలా అన్ని కేసుల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను పట్టుకుంటున్నారు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని పెద్దేముల్ మండల ఎస్సై పి.శంకర్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని దుగ్గపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో గ్రామస్తులందరూ కలిసి సుమారు 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇందుకోసం గ్రామంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తెలిపారు. ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం అని, నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతో మేలు చేస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులకు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
