వికాసిత్ నారాయణపేట బిజెపి పాలకవర్గం లక్ష్యం

బీజేపీకి పట్టం కట్టిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు

వికాసిత్ నారాయణపేట బిజెపి పాలకవర్గం లక్ష్యం

బిజెపి పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్

నారాయణపేట ఫిబ్రవరి 17:

మున్సిపాలిటీ బిజెపి నూతన పాలకవర్గం నారా యణపేట వికాసిత్ లక్ష్యంగా పని చేస్తుందని నారాయణ పేట పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్ అన్నారు. మంగళవారం ఆయన విలే కరుల సమావేశంలో బి జె వి ఎం పట్టణ అధ్యక్షుడు మణి కంఠ, మీడియా ఇంఛార్జి కిరణ్ లతో కలిసి మాట్లాడు తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారం,ఎంపి డి కే అరుణ సహకారంతో పట్టణాన్ని అభి వృద్ది పథంలో నడిపిస్తామని అన్నారు.బిజెపి  జెండాను నారాయణపేట మున్సిపాలి టీ పై ఎగుర వేయడానికి సహకరించిన పట్టణ ఓటర్లు అందరికీ ధన్యవాదాలు తెలి పారు. అభ్యర్థుల ఎన్నిక దగ్గర నుండి ఎన్నికల పూర్తి అయ్యి చైర్మన్ ప్రమాణ స్వీకా రం వరకు సహకారం అందిం చిన ఎంపీ డికే అరుణ కు ధన్యవాదాలుతెలిపారు.అలాగే ప్రతి వార్డులో ప్రచారం నిర్వహించి బిజెపి అభ్యర్థుల ను గెలిపించేందుకు కృషి చేసిన బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామా జీ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రతంగ్ పాండు రెడ్డి, ఎన్నికల ఇంచార్జీ శ్రీకాంత్ రెడ్డి,కో కన్వీనర్లు రఘు రామ య్య గౌడ్,మిర్చి వెంకటయ్య లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పట్టణంలోని  24 వార్డ్ లకు గాను 12 సీట్లు బీజేపీ కి అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజ లు ఎల్లపుడు మాకు సూచన లు సలహాలు అందించి మాకు మార్గదర్షకత్వం గా ఉన్న మీడియాకు కృతజ్ఞ తలు తెలిపారు.కొద్ది తేడాతో కొన్ని వార్డ్ లు కోల్పోయిన ప్పటికీ గెలుపు అంచుదాకా తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి, పోస్టల్ బ్యాలెట్ బీజేపీ కి అనుకూలంగా వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల అభిమానం ఎల్లపుడు ఇలాగే ఉండాలని కోరారు.
ఫోటో రైట్ అప్:1.విలేకరుల సమావేశంలో మాట్లాడు తున్న పోషల్ వినోద్ 
______________________

Tags:

About The Author

Latest News