ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు - జిల్లెడ్ చౌదరిగూడ మండలం తహాసిల్దార్ జగదీశ్వర్ *                         * ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం - ఎంపీడీవో-  ప్రవీణ్ కుమార్ .

పౌర హక్కులఫై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు ప్రజా ప్రజలకు ఉంది- లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి.

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు - జిల్లెడ్ చౌదరిగూడ మండలం తహాసిల్దార్ జగదీశ్వర్ *                         * ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం - ఎంపీడీవో-  ప్రవీణ్ కుమార్ .

పౌర హక్కులలో పత్రికా స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత  ఎంతో ముఖ్యం *                                                                   * పౌర హక్కుల వేదికలలో పత్రిక మీడియా ప్రతినిధులు, మేధావులను భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది -

లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ రామ్                                          
రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):                   IMG-20260130-WA0247

   పౌర హక్కులను కాపాడటం తో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని జిల్లేడు చౌదరిగూడ మండలం తహసిల్దార్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఎల్కగూడెం గ్రామంలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన "పౌర హక్కుల " పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జగదీశ్వర్ మాట్లాడుతూ.... పౌర హక్కులను కాపాడటం, కుల మత, వర్గ బేధం లేకుండా ప్రజలకు సమాన హక్కులను కల్పించడం, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. పౌర హక్కులను ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం ప్రతి పౌరుడికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాజ్యాంగంలోని చట్టాలు, పౌర హక్కులను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాల్లో ఎవరైనా కులం మతం పేరుతో దూషిస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.... ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కుల మత వర్గ పేద ధనిక అనే తారతమ్యం  లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతినెల ఈ పౌర హక్కుల ఫై అవగాహన సభలను గ్రామాల వారిగా నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ నెల కూడా పౌర హక్కుల అవగాహన సభను ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను ఈ వేదిక ద్వారా నిర్భయంగా విన్నవించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకల్ గైడ్ దినపత్రిక ఎడిటర్ చిలకమర్రి రాంరెడ్డి 
 భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన హక్కులలో పౌర హక్కు అనేది  ముఖ్యమైన భాగమన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో స్వేచ్ఛ, సమానత్వం, విద్యా, వైద్యం ఎంతో ముఖ్యమైనవన్నారు. పౌర హక్కుల లు,  పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పౌర హక్కుల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. కొందరు అధికారులు ప్రజలు తమ సమస్యలతో కార్యాలయాలకు వెళితే ప్రజలు అడిగిన సందేహాలు, సమాచారం కొందరు అధికారులు సావధానంగా సమాధానం చెప్పకుండా విసిగించుకోవడం, నిర్లక్ష్యం వహించడం, పదేపదే కార్యాలయల చుట్టూ తిప్పడం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇకనైనా అలాంటి అధికారులు తమ ప్రవర్తనను మానుకొని ప్రజలకు బాధ్యతగా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం 2025 ఫై ప్రజలు అవగాహన కల్పించుకోవాలన్నారు. ఏ ప్రభుత్వ అధికారి అయిన, ప్రజా ప్రతిధులు అయినా తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందన్నారు. పౌర హక్కుల పై ప్రతి నెల నిర్వహించే గ్రామ సభలో విలేకరులను భాగస్వాములు చేయాలని కోరారు. అదేవిధంగా సర్పంచ్ చాకలి బందయ్య మాట్లాడుతూ ప్రతి గ్రామవాసి తన హక్కులను తెలుసుకొని అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. పౌర హక్కుల పై గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సభ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అడగకముందే అధికారులు వచ్చి పౌర హక్కులపై అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేయాలని ప్రజలు లేవచ్చిన అంశాలపై స్పందించిన తహసిల్దార్ జగదీశ్వర్  , గ్రామంలో సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేసి, వాటిని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు.
 ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News