రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి

రాజస్థాన్‌లో ప్రారంభానికి ముందే రోడ్డుకి చేదు గతి

దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో నదులు ఉప్పొంగి, అనేక చోట్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయి. రహదారులు, బ్రిడ్జిలు ధ్వంసమవుతున్నాయి.తాజాగా రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో కూడా పరిస్థితి ఘోరంగా మారింది. ఝుంఝును (Jhunjhunu) జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్లి నది (Katli River) ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతికి బఘలి-జహాజ్, ఝుంఝును-సికార్‌లను కలిపే నూతన రోడ్డుపై విరుచుకుపడి దానిని కొట్టుకుపోయింది. ఈ రోడ్డును రెండు జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఆరు నెలల క్రితం నిర్మించారు. ఇంకా అధికారికంగా ప్రారంభించకముందే, వరదలు దాన్ని నాశనం చేయడం స్థానికులను నిర్మాణ నాణ్యతపై ఆందోళనకు గురి చేస్తోంది.

Tags:

About The Author

Latest News