జీవితాన్ని గెలవాలి
మనిషి జీవితం సమస్యల
నిలయం పోరాటాల
వలయం కోరికల చక్రబంధం
ఆట లాంటిది గెలుపు
ఓటములు ఎదురైనా లక్ష్య
సాధనలో ముందుకు సాగాలి
జీవితం అనేది ఒక
నధిలాంటిది నదీ ప్రవాహం
ప్రారంభమైతే ఎన్ని
అవరోధాలు ఎదురైనప్పటికీ
ఆగకుండా గమ్యం చేరే
దాకా ప్రవహిస్తూనే ఉంటుంది
మధ్యలో కొండలు గుట్టలు
అడ్డం వస్తే దారి
మార్చుకుంటుంది
ఎత్తు నుంచి దూకి
జలపాతమోతుంది
మురికి నీరును మంచి
నీరును వెంట
తీసుకుపోతుంది
జీవితం అంటే మంచి
చెడుల మిశ్రమం
ఎలాంటి అనుభవాలు
ఎదురైనా లక్ష్యం వైపు
పురోగ మించాలి
మనిషి ఎప్పుడు తనమీద
తనకున్న విశ్వాసాన్ని
కోల్పోకూడదు
ఆత్మవిశ్వాసమే
ఆయుధంగా
జీవిత గమ్యాన్ని
సాధించాలి
కష్టమైన సంతోషమైన
నవ్వుతూ ఉండాలి
అప్పుడు జీవితం
అంటే భయం ఉండదు.
భవిష్యత్తు అంటే భాద
ఉండదు. డబ్బులు
సంపాదించడం కాదు
మనుషులను
సంపాదించుకో
అదినీకు విలువైన ఆస్తి
భయపడుతూ కూర్చుంటే
బతకలేవు ఒక్క అడుగు
ముందు కేసి చూడు
గెలుపు నిన్ను నడిపిస్తుంది
మన చేతిలోనే మన
జీవితం ఉంటుంది
మన జీవితానికి
మనమే కర్త కర్మ క్రియ
కొత్త ఆలోచన వైపు
నిరంతరం పరుగులు
పెట్టాలి నవతను
ఆహ్వానించాలి
స్వశక్తితో ప్రగతి పథాన
ముందుకు సాగాలి
మన జీవన చిత్రాన్ని
మనమే చిత్రించుకోవాలి
రేపటి గురించి చింతించకు
ఈరోజును మర్చిపోవడం
అవివేకం ఊహా లోకంలో
తేలి పోతు ప్రణాళికలు
వేయొద్దు
పట్టుదలతో ముందుకు
సాగు నిన్నటి రోజును
సమీక్షిస్తూ నేటిని ఆస్వాదిస్తూ
రేపటికి ప్రణాళిక రూపకల్పనే
జీవన గమనంలో గొప్ప
మైలు రాయి కావాలి
వర్ధమానమే మన జీవన
సంపద గతాన్ని తలవద్దు
అది చేతి నుండి జారిపోయిన
నీటి లాంటిది భవిష్యత్తు
అయోమయం అగోచరం
అస్థిరత్వం
మనిషి ఒకసారి
పోగొట్టుకుంటే
దొరకనివి మూడు
నోటి నుంచి వచ్చిన
మాట చేజారీన
అవకాశం
కరిగిపోయిన కాలం
సమయాన్ని సద్వినియోగం
చేసుకుంటూ ఎవరికి వారే
ఉద్ధరించుకోవాలి
ఎవరి పనులకు వారే
బాధ్యులు కావాలి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదిరి చూసి మోసపోవద్దు
సోమరితనాన్ని వదలాలి
మొద్దు నిద్ర వీడాలి
ప్రగతి చోదక శక్తిగా
ఎదగాలి స్వయం
సంకల్పిత జీవన శైలితో
క్రియాశీలురై జీవన
సమరంలో గెలువాలి
విజయతీరాలను
చేరాలి గమ్యాన్ని
ముద్దాడాలి
సమాజంలో ఉత్తమ
పౌరులుగానిలిచి
యువతకు
స్ఫూర్తి నిలువాలి
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
1)తెలంగాణ ఎకనామిక్ ఫోరం
2)సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
3)తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం 4)తెలంగాణ వికాస వేదిక
5) మాజీ కరెస్పాండెంట్ జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
కరీంనగర్
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారయ్య)
కరీంనగర్ 9440245771
About The Author
