విజ్ఞాన చైతన్య ప్రదాత గురువు
గురువు అంటే
త్రిమూర్తి స్వరూపం
అజ్ఞానం నుండి
జ్ఞానంవైపు నడిపించి
జీవితానికి
అర్థం కల్పిస్తాడు
అజ్ఞాన అంధకారం
నశింప చేసి
వెలుగు వైపు
నడిపిస్తాడు
వివక్షను తెలిపి
బతుకు బండి
నడుపుటకు బాట
చూపి జీవన
సమరంలో సమస్యల
సవాళ్ల పరిష్కార
మార్గదర్శి
జీవన విద్యలో
మెలుకువలు చెప్పి
ఆత్మవిశ్వాసాన్ని
పట్టుదలను ప్రేరేపించి
అభ్యుదయ భావాలను
ఆవిష్కరించి
అభివృద్ధికి
దశ దిశ నిర్దేశిస్తాడు
మనిషి జననం
నుండి మరణించే
వరకు ప్రతి విషయంలో
గురువు ఉంటాడు
భారతీయ సంస్కృతిలో
గురువు పరంపరకు
ప్రత్యేకత సంతరించుకుంది
గురువు భగవంతునికి
భక్తునికి మధ్య సంధాన కర్త
అజ్ఞానంగా వున్న మనకు
విజ్ఞానం బోధిస్తాడు
అదమరిచి వున్న
మనకు అర్థశాస్త్రం
బోధిస్తాడు ఆర్థిక
అక్షరాస్యత పరిజ్ఞాన
పరవ్యాప్తి స్పృహను
సృష్టిస్తాడు
పౌరశాస్త్రం చరిత్ర
చెప్పి సంస్కృతి
పాలన ధర్మ రక్షణ పట్ల
కార్యోన్ముఖులను చేస్తూ
వెన్నంటి వుండే
కొండంత అండ గురువు
పామరులను
పండితులను చేసే
నిర్మలమైన స్వచ్చమైన
ప్రేమాప్య్యాయతలు
చూపే దైవం గురువు
గురువు విద్యతో పాటు
వినయం విచక్షణ
తాత్వికత తార్కికత
నేర్పిస్తాడు
పరిశీలన పరికల్పన
పరిశోధన
వివరణ విశ్లేషణా శక్తి
సామర్ధ్యాల
ఉద్దీపనకు
ఉత్ప్రేరకంగా
నిలుస్తాడు
చీకట్లను తొలిగించి
వెలుగులు పంచే
దివ్వె గురువు
జీవితానికి గమ్మ్యాన్ని
మార్గనిర్దేశం చేసే
మహర్షి గురువు
ఉన్నత స్థాయిలో
శిష్యుల ప్రగతికి
పాటుపడి
దారి చూపే జ్ఞాన
జ్యోతి గురువు
సమాజంలో అజ్ఞానాన్ని
తరిమివిజ్ఞానాన్ని పెంచి
మంచి తనం పంచి
మేథో సామర్ధ్యాలు
పెంచుకొని
భారత దేశ కీర్తి
ప్రతిష్టలు పెంచుదాం
భారతీయ సంస్కృతి
ఆధ్యాత్మికతను
జగతిన చాటుదాం
ఉత్తమ పౌరులుగా
ఎదుగుదాం
ఉజ్జ్వల భవిష్యత్తుతో
విజ్ఞాన భారత్
నిర్మాణ ప్రక్రియలో
భాగస్వాములమై
ప్రగతి శీల ప్రతిభా
ఆవిష్కరణలతో భారత్ ను
విశ్వ గురువు స్థాయికి
చేర్చుదాం
నేదునూరి కనకయ్య
1)రాష్ట్ర స్థాయి ఉత్తమ
అధ్యాపక అవార్డ్ గ్రహీత
2)ఉత్తమ ఆర్థికవేత్త అవార్డ్ గ్రహీత అధ్యక్షులు
3)తెలంగాణ ఎకనామిక్ ఫోరం
4)తెలంగాణ ఎడుకేషన్ ఫోరం
5)సామాజిక ఆర్థిక అధ్యయన
వేదిక
గ్రామం కల్లెపల్లి
మండలం బెజ్జంకి
జిల్లా సిద్ధిపేట
About The Author
