శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్.
నారాయణపేట ఫిబ్రవరి 17:
నారాయణపేట జిల్లా కొత్తప ల్లి మండలంలోని తిమ్మారెడ్డి పల్లి లో ఏప్రిల్ 1 నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) బ్రహ్మోత్సవాలకు అధికారు లు పగడ్బందీగా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని నారా యణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయ అవర ణలో సంబంధిత శాఖల అధి కారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్ల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమకు అప్పగిం చిన బాధ్యతలను సమర్థవం తంగా నిర్వహించాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ కు నోడల్ అధికారి పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా వి.ఐ.పి మేనేజ్ మెంట్ జాగ్ర త్తగా చూసుకోవాలని సూచిం చారు. దేవాదాయ శాఖ పరం గా ఏం ఏర్పాట్లు చేశారని అడిగారు. ఆలయానికి, రథా నికి కలర్స్ వేయిస్తున్నామని, మిగతా జాతర ఏర్పాట్లు చేస్తున్నామని ఈ.వో తెలి పారు. జాతర కోసం తమ శాఖ నుంచి మొత్తం 15 మంది ఉద్యోగులు సిబ్బందిని డిప్యూట్ చేయగా ప్రస్తుతాని కి ఇద్దరు వచ్చి విధుల్లో చేరా రని, మిగతా 13 మంది రెండు రోజుల్లో వస్తారని ఈ.వో తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సారి ఆల యంలో సీసీ కెమెరాలు అమర్చుతామని ఈ. వో తెల పగా, పోలీసు శాఖ కోరినట్లు మొత్తం సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలని కలెక్టర్ ఆదేశిం చారు. మిషన్ భగీరథ పరం గా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి కొరకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలన్నా రు. డోర్స్ తదితర దానికి సెప్టిక్ ట్యాంక్ మెయింటెనెన్స్ గ్రామపంచాయతీ వాళ్ళు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది వాకి టాకీలు కావాలని అధికారు లు అడిగారు. దేవాదాయ శాఖ ఆర్ జె సి ఆధ్వర్యంలో క్యూలైన్లు ఏర్పాటు చేయా లని 20 మందిని నియమించి వెళ్లేలా చర్యలు తీసుకోవాల ని దేవాలయంలో లోపల డెకరేషన్ చేయాలన్నారు. డిపిఓ 3 పర్యాయాలు షిఫ్ట్ పద్ధతిన 500 మంది సిబ్బంది ని ఏర్పాటు చేయాలన్నారు. డీఎంహెచ్వో ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయాలని మూడు క్యాంపులు పెట్టాలని మొబైల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. రెండు ఫైర్ వాహనాలు ఏర్పాటు చేయా లన్నారు. డిఆర్డిఏ ఆధ్వ ర్యంలో ప్రాజెక్టు డైరెక్టర్ మొబై ల్ టాయిలెట్స్ బస్సు ట్యాంక ర్ దగ్గర బట్టలు మార్చుకొ నుటకు వెదురు తడకలతో తాత్కాలిక బాత్రూమ్ స్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ ఈ ఆధ్వ ర్యంలో విద్యుత్ సరఫరా కై 20 మంది సిబ్బందిని ఏర్పా టు చేయాలని మొబైల్ ట్రాన్స్ఫార్మర్, లుస్ లైన్స్ లేకుండా ఏర్పాట్లు చేయాల న్నారు. రవాణా సంస్థ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు. తాసి ల్దార్ కొత్తపల్లి కంట్రోల్ రూమ్ చూడాలని మద్దూర్ ఎంపీడీ వో జాతర అయిన తర్వాత కూడా సిబ్బంది అందుబాటు లో ఉండాలన్నారు. బడ్జెట్ కొరకు దేవాదాయ శాఖ తయారు చేయాలని. రెగ్యు లర్ ఈవో ఉండాలని దేవాల య ఫౌండర్ మాజీ చైర్మన్ ఆఫ్ టెంపుల్ గోపాల్ కోరినా రూ. ఎక్సైజ్ శాఖ రెండు మొబైల్ టీమ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ సీసీ కెమెరాలు బార్కెట్లు బందో బస్తు పార్కింగ్ ఏర్పా టు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, డి. ఎస్. పి. లింగయ్య, ఆర్. డి. ఓ. రామచందర్ అధికారులు, సి.ఐ.ఎస్.ఐ. దేవాలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ మాజీ చైర్మన్ ఆఫ్ టెంపుల్ గోపాల్, గ్రామ సర్పం చ్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ పట్నాయక్
_________________________
