అస్తిత్వం, సామాజిక పురోభివృద్ధికై కలిసి రావాలి.

వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం పిలుపు.

అస్తిత్వం, సామాజిక పురోభివృద్ధికై కలిసి రావాలి.

హనుమకొండ  ప్రతినిధి జనవరి 26 (లోకల్ గైడ్ న్యూస్)

హన్మకొండ లో 
వీరశైవ లింగాయతుల అస్తిత్వం కాపాడుకోవడానికి, సామాజిక పురోభివృద్ధి సాధించడానికి లింగాయతులందరూ కలిసి రావాలని వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు- పట్నం శెట్టి వీర సోమయ్య అన్నారు.
హైదరాబాద్ కోకాపేట సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం బసవ భవన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం వద్ద రాష్ట్ర వీరశైవ లింగాయత్/ లింగ బలిజ సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార ఉత్సవం సందర్భంగా హనుమకొండ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బయలుదేరిన బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. జిల్లా సంఘం గౌరవ సలహాదారు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు గుండవరం విధు మౌళి మాట్లాడుతూ నూతన రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటుతో లింగాయత్ సమాజం బలోపేతం కావడంతో పాటు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సంఘం సలహాదారు  నానం రాజయ్య మాట్లాడుతూ  లింగాయత్ లలో ప్రేరణ, సామాజిక వికాసం కలిగించడానికి సంఘం ప్రతినిధుల, సభ్యులందరి సహకారంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు పట్నం శెట్టి ఈశ్వరయ్య, సలహాదారులు పెనాల సమ్మయ్య  పట్నం శెట్టి గౌరీ శంకర్, ప్రధాన కార్యదర్శి పట్నం శెట్టి శైలేష్ ప్రసాద్, కోశాధికారి దుర్గం సమ్మయ్య, ప్రతినిధులు వెన్న కోటేశ్వరరావు, సాయం జ్ఞానేశ్వర్, మహిళా కమిటీ ప్రతినిధులు బానాల గౌరీ  సాయం ఉష, కొల గాని శోభ, జి సువర్ణ, మహాదేవుని సుహాసిని, పట్నం శెట్టి నిర్మల, వుప్పు సమత దుర్గం అనిత, కుదిరే సౌజన్య, యువజన కమిటీ అధ్యక్షులు- వుప్పు శివకుమార్ (సునీల్),  కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News