అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన పానీపూరి కుటుంబానికి ఆర్యవైశ్య యువజన సంఘం అండ
జీవనోపాధి కొనసాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి వలసవచ్చిన ఈ నిరుపేద కుటుంబం
పాలకుర్తి (లోకల్ గైడ్)
పాలకుర్తి మండల కేంద్రంలోని శాంతినగర్‌లో బండి యాకన్నకు సంబంధించిన ఇంట్లో నివసిస్తున్న తారసింగ్ (బబ్బులు) అనే వ్యక్తి కొద్ది సంవత్సరాలుగా మండల కేంద్రంలో పానీపూరి వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి వలసవచ్చిన ఈ నిరుపేద కుటుంబం ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఇంట్లోని సామగ్రి, నిత్యావసర వస్తువులు మరియు నగదును పూర్తిగా కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
ఈ దుర్ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పాలకుర్తి మండల యువజన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చారగొండ్ల శివ (రాజా ఉపేందర్), ఉపాధ్యక్షులు రాపాక వెంకటేష్ బాధిత కుటుంబానికి సుమారు ₹5000 విలువగల బట్టలు, దుప్పట్లు మరియు నిత్యవసర వస్తువులను, మాధంశెట్టి భాస్కర్ వెయ్యి రూపాయలు, పబ్బా సంతోష్ వెయ్యి రూపాయలు, అందజేసి మానవతా దృక్పథంతో ఆదుకున్నారు.
ఆర్యవైశ్య మహాసభ ఎల్లప్పుడూ కుల, మత భేదాలకు అతీతంగా బాధలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందుంటుంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి మానవీయ కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు మాధంశెట్టి భాస్కర్, పబ్బ సంతోష్, చారగొండ్ల భరత్, నంగునూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
