ఎం పీ రామ సహాయం నీకి కృతజ్ఞతలు.
కారేపల్లి వాసులకు సీ ఎం ఆర్ ఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మం జిల్లా, కారేపల్లి: లోకల్ గైడ్, జనవరి 28 :
కారేపల్లి మండల వాసులకు సీ ఎం ఆర్ ఫ్ చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతాను అందిస్తుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి సిఫారసు మేరకు, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ ఎం ఆర్ ఫ్) నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి చెక్కులు మంజూరు అయ్యాయి.అందులో భాగంగా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సతీష్‌కు రూ.24,000, కారేపల్లి గ్రామానికి చెందిన తనకం నవీన్‌కు రూ.24,000 .ఈ చెక్కులను కారేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల నాగేశ్వరరావు, బండారి మురళి చేతులమీదిగా అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు గౌరవ ఎంపీ కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
