ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.. మార్చి 5.(.లోకల్ గైడ్)
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆల్ఫా జూనియర్ కాలేజ్, వేదాంత జూనియర్ కాలేజ్ లలో ఏర్పాటు చేసిన
పరీక్షా కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా త్రాగునీరు, శుభ్రమైన మూత్రశాలలు, ప్రథమ చికిత్సతో కూడిన మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలని, మాల్ ప్రాక్టీస్ లేదా మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పరీక్షా హాలులోకి అనుమతించాలని
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. డి ఐ ఈ ఓ దస్రు నాయక్, అధికారులు ఉన్నారు.
