ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి... జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ
ప్రజావాణిలో ప్రజల అర్జీలు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారిణి
ఖమ్మం, మార్చి -16:లోకల్ గైడ్ :
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు.
తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ కే. కిరణ్ కుమార్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పక్కనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బీసీ హాస్టల్ భవనంలోకి మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డిఎంహెచ్ఓకు రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ వేదిక నుంచి ఖమ్మం మూడవ టౌన్ ప్రాంతం గాంధీ చౌక్ లో ఉన్న ఈద్గాను మరమ్మత్తులు, గోడ నిర్మాణం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్డిఓకు రాస్తూ తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
వైరా మండలం కోష్టాల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు వి. సాంబయ్య గ్రామ సర్పంచ్ తన ఇష్టానుసారంగా నర్సరీ మొక్కలను పెంచుతున్నారని గ్రామానికి నష్టం జరుగుతుందని నివారించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వైరా ఎంపిడిఓ/డి.ఎల్.పి.ఓ. కు రాస్తూ విచారించి తగుచర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
