సోషియల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు సరికాదు
పేట చైర్మన్ అభ్యర్థిని ప్రకటించలేదు.
జిల్లా ఎన్నికల ఇంచార్జి కొత్తకాపు రతంగ పాండు రెడ్డి.
నారాయణపేట జనవరి 31:
భారతీయ జనతా పార్టీ నారాయణపేట మున్సిపల్ చేర్మెన్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించలేదనీ జిల్లా ఎన్నికల ఇంఛార్జి కే.రతంగ్ పాండురెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.. కానీ సోషల్ మీడియాలో కొన్ని పేపర్లలో ఒక్కపేరు మాత్రమే బిజెపి చేర్మెన్ అభ్యర్థి అని జరిగే ప్రచారం చేయడం సమంజసంకాదని అన్నారు.పార్టీ తరపున నలుగురు అభ్యర్థులు చేర్మెన్ కొరకు పోటీపడుతున్నారు అని తెలిపారు. మొన్న జరిగి న పత్రికా సమావేశంలో మీడి యా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్వయంగా ఎంపీ అరుణమ్మ జవాబు చెప్పడం జరిగిందన్నారు.బిజెపి పార్టీ చేర్మెన్ అభ్యర్థిని ప్రకటించ లేదు అని తెలిపారు.ఎన్నికల ఫలితాల తర్వాతనే పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం చేర్మెన్ అభ్యర్థిని ఎన్నుకోవ డం జరుగుతుందన్నారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇటు వంటి వాటిని నమ్మకుండా వార్డులలో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నా లు మానుకోవాలని హితవు పలికారు.
ఫోటో రైట్ అప్:7.రతంగ్ పాండురెడ్డి
_____________________
