కాసిపేట గని అధికారికి సన్మానం.

ఉద్యోగులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

కాసిపేట గని అధికారికి సన్మానం.

బెల్లంపల్లి (లోకల్ గైడ్)

కాసిపేట గనిలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ వెంకటేష్ ను 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సింగరేణి స్థాయి ఉత్తమ అధికారిగా ఎన్నికైనందుకు కాసిపేట గనిపై ఉద్యోగులు,కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.కాసిపేట గని విస్తరణలో సాండ్ స్టోవ్వింగ్,1ఎ టన్నల్ లో కొత్తగా మ్యాన్ రైడింగ్ ఏర్పాటు,గని ఉత్పత్తిలో అత్యధిక కృషి చేసినందుకు ఆయనకు ఉత్తమ అవార్డు దక్కింది.అవార్డు అందుకున్న ఆయనను ఎఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్,పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మినారాయణ,ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్,కన్నయ్య,టిబిజికెఎస్ నాయకులు బైరి శంకర్,రమేష్, పలువురు ఉద్యోగులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అనంతరం ఏజెంట్ రాంబాబు,మేనేజర్ సతీష్,రక్షణ అధికారి నిఖిల్,గని సంక్షేమ అధికారి మీర్జా,సర్వేయర్ ప్రభాకర్,ఖాన్ అందరి కృషి వల్ల త్వరగా పనులు పూర్తి అయ్యాయని ఇది అందరి సహకారంతో చేయగలిగానని అన్నారు.ఈ కార్యక్రమంలో రాజేందర్,సంతోష్,పిట్టల శివ,శ్రీకాంత్,రాజన్,అబ్దుల్ రంజిత్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News