శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
డా బి ఆర్ అంబేద్కర్ గూర్చి విద్యార్ధులకు వివరించారు..
చర్ల : లోకల్ గైడ్ :
రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా శ్రీ సరస్వతీ విద్యానికేతన్ లో ఘనంగా గణతంత్ర వేడుకను నిర్వహించారు. చిన్నారులు స్వాతంత్ర యోధుల వేషధారణలతో వారి నినాదాలు చేస్తూ అందరినీ అలరించారు. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ గా కె టోనీ తేగడ ఎంపిక అయినట్లు, ప్రతీ సంవత్సరం మాదిరి సంవత్సర ఉత్తమ విద్యార్ధి టోనీ తల్లితండ్రుల రమాదేవి, నానమ్మ, సత్తెమ్మ చేతుల మీదుగా జాతీయ ఆవిష్కరణ చేసారు. రాజ్యాంగ రూపకర్త డా బి ఆర్ అంబేద్కర్ గూర్చి విద్యార్ధులకు వివరించారు. ఈ వేడుక అరుణ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆనందం గా జరిగిందని, ఉపాధ్యాయులందరూ ఆమెను అభినందించారు. శ్రీ సరస్వతి విద్యానికేతన్ అండదండగా ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులకి డైరెక్టర్ లిఖిత కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా సంవత్సర ఉత్తమ విద్యార్ధి టోనీ అమ్మ రమాదేవి, నానమ్మ, సత్తెమ్మ మాట్లాడుతూ మా టోనీ ఉత్తమ విద్యార్ధిగా ఎపింక అవ్వడం మాకు గర్వకారణమని, మాకు జాతీయ పతాక ఆవిష్కరణ చేయమని స్కూలు యాజమాన్యం ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సరస్వతి విద్యానికేతన్ వారికి, ఈ రకంగా ఉత్తమ విద్యార్ధిగా మా బిడ్డని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెంకటలక్ష్మి, విద్యార్థులునీ ఉద్దేశించి అందరూ చాలా బాగా ప్రదర్శించారని, ఈ అరయోధులే అసలైన హీరోలని, వారిని విద్యార్థులు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి గుణగణాలు ఆచరణీయమని, విద్యార్థులనీ ఈ రకంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను, పాఠశాలని అభినందించారు. అనంతరం అరుణ మాట్లాడుతూ దేశనాయకులు, రాజ్యాంగం గూర్చి వివరించి అన్ని పాఠశాలల మాదిరిగా కాక మా శ్రీ సరస్వతీ విద్యానికేతన్ లో పిల్లల వైపు నుండే ఆలోచించి వారికి అవసరమైన ప్రతి అంశంలో అవగాహన కల్పిస్తూ వారిని మరింత సమర్ధవంతంగా ఉత్తమ విద్యార్ధిలు గా తీర్చిదిద్దడం, మా విద్యాసంస్థ యొక్క ప్రత్యేకతని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరి, అరుణ, చంద్రకళ, పూజ, శ్రావణి, అమీనా సాంబశివరావు, తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
