బాల్యం పనిలో కాదు బడిలో వుండాలి"

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.

బాల్యం పనిలో కాదు బడిలో వుండాలి

 

 

హనుమకొండ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01లోకల్ గైడ్ :

చిన్నారులు పనుల్లో కాకుండా బడి వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 'ఆపరేషన్ స్మైల్-12 కార్యక్రమంలో ద్వారా మొత్తం 179 మంది చిన్నారులకు చాకిరీ నుండి విముక్తి అయినట్లుగా వరంగల్ పోలీస్ కమీషనర్  తెలిపారు. 
 ఆపరేషన్ స్మైల్ 12వ విడత లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 31 రోజుల పాటు  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో తొమ్మిది డివిజన్ల చెందిన పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు చెందిన  బాలల పరిరక్షణ విభాగం , చైల్డ్ హెల్ప్ లైన్,  కార్మిక శాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల సిబ్బందితో ఏర్పాటు చేసిన తొమ్మిది ప్రత్యేక బృందాలతో  వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ఇటుక తయారీ కేంద్రాల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో తనిఖీ చేపట్టాగా, ఈ తనిఖీల్లో  179 బాల కార్మికులను గుర్తించడం జరిగింది. ఇందులో 
 150 మంది బాలురు, 29 బాలికలు  అలాగే పోలీసులు రక్షించిన చిన్నారుల్లో మధ్యలో చదువు మానేసిన 14మంది చిన్నారులు వున్నారు. వీరిలో బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 87 మంది చిన్నారులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.అలాగే రక్షించబడిన చిన్నారులను ఆయా జిల్లాలకు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ముందు హాజరు పరిచి, పిల్లలకు,  వారు తల్లి తండ్రులకు కౌన్సిలింగ్  నిర్వహించి, వారికి అప్పగించడమైంది. ప్రధానంగా చిన్నారులతో పనులు చేయించుకున్నందుకు యజమానులపై 51 కేసులు నమోదు కాగా, కార్మిక శాఖ చేత 53 ఐ. ఆర్ నమోదు అయ్యాయి. మరో 61 మంది చిన్నారులపై పోలీసులు దృష్టి పెట్టేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లలో చిన్నారుల వివరాలను అందజేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ చిన్నారుల బాల్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,చిన్నారుల హక్కులను కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఎవరైనా బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తే వారిపై ఖండించిన తప్పవని, బాల కార్మిక వ్యవస్థ రహితం కమిషనరేటే మనందరి లక్ష్యమని సీపీ తెలిపారు.
 ఆపరేషన్ స్మైల్ 12 విడత విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రతిభగైన వచ్చినా అడిషనల్ డీసీపీ,వరంగల్ కమిషనరేట్ స్పెషల్ జువైనైల్ పోలీస్ అధికారి ఎన్. రవి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్ స్పెక్టర్ జె. శ్యామ్ సుందర్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది,  మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ , లేబర్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లతో పాటు షేర్, స్కోప్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థలు,చైల్డ్ లైన్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేసారు.

Tags:

About The Author

Latest News